హైదరాబాద్ మార్చి 30
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, జీ హెచ్ ఎం సీ తార్నాక సర్కిల్ పరిధిలో లాలాపేట ఫ్లైఓవర్ నుండి స్ట్రీట్ నం. 1, తార్నాక వరకు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ డ్రైవ్లో సుమారు 15 శాశ్వత ఆక్రమణలు మరియు 18 తాత్కాలిక ఆక్రమణలు గుర్తించిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తొలగించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎం.ఎన్.ఆర్ జ్యోతి, ఏసీపీ పావని టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ చర్యల ద్వారా ట్రాఫిక్ సౌకర్యం, పాదచారుల భద్రత మరియు నగర నిర్వహణ మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయునది ఏమంటే రోడ్లు, ఫుట్పాత్లు పై ఎటువంటి ఆక్రమణలు చేయకూడదన్నారు. జీ హెచ్ ఎం సి తరచుగా ఇటువంటి డ్రైవ్లను కొనసాగిస్తుందన్నారు. ఎవరైనా ఆక్రమణలు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శుభ్రమైన, సురక్షితమైన మరియు ఆక్రమణల రహిత నగరాన్ని నిర్మించడంలో ప్రజల సహకారం కోరుతున్నామని అధికారులు తెలియజేశారు.



