తెలుగు తోట పంట తినగ విందు – తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్

అచ్చతెలుగు భాషా సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ రచించిన “తెలుగు బిడ్డ శతకం” సరళంగా, సుందరంగా సాగిందని అద్దంకి రెవిన్యూ డివిజన్ అధికారి యస్. జాన్సన్ తెలిపారు. గురువారం దర్శి తహశీల్దారు కార్యాలయంలో గ్రంథాన్ని ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు .
దర్శి తహశీల్దారు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌ తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ ఈ శతకాన్ని రచించి దర్శి తహశీల్దారు శ్రవణ్ కుమార్ కి అంకితం ఇవ్వడం విశేషం. తెలుగు భాషపై ఆయనకున్న అభిమానం, పదసంపద ఈ రచనలో ప్రతిబింబించిందని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభినందించారు.
ఈ కార్యక్రమానికి కప్పగంతుల మధుసూదన శాస్త్రి అధ్యక్షత వహించారు. అక్షర తపస్వి అన్నపురెడ్డి వీరారెడ్డి, పుట్టంరాజు శ్రీరామ చంద్ర మూర్తి, అట్లూరి రామారావు, వి. వెంకటేశ్వరరావు, ప్రేమ్ కుమార్, జి.వి. రత్నం, యస్.వి. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని రచయితను అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *