కంటికి రెప్పలాకాపాడాల్సిన కన్నతండ్రే మైనర్ కుమార్తెపై మండలంలోని ఓ గ్రామంలో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆ లస్యంగా వెలుగు చూసింది. ఈఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫోక్సో కేసు నమోదయింది. వివ రాల్లోకి వెలితే ఆగ్రామంలోని ఒకదంపతులకు ఇద్దరు కుమార్తెలు కలరు. ఇద్దరు మైనర్లు గ్రామంలోనే చదువుకుంటున్నారు.మైనరైన పెద్దకుమార్తె నాలుగు, ఐదు నెలలకిత్రం పుష్పావతి ఐనది. పలు చెడు వ్యసనాలకు బానిసైన కన్నతండ్రి ఆమైనర్ బాలికను బయపెట్టి రెండునెలలుగా రెండు మూడు పర్యాయాలు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమైనర్ కు గత వారం రోజులుగా తీవ్ర కడుపు నొప్పిగా వుండి బాధపడుతున్నది. మైనర్ తల్లి కుమార్తెకు ఆరోగ్యం గురించి చూపించేందుకు ఒం గోలు రిమ్స రెండు రోజుల కిత్రం తీసుక వెళ్లింది. రిమ్స్ లో ఆ మైనర్ కి వైద్య పరీక్షలు చేయించగా ఆమైనర్ ను అత్యాచారం చేశారని, అందువల్లే కడుపు నొప్పి వస్తున్నదని తల్లికి వివరించారు. తల్లి కుమార్తెను ఎవరు ఈ పాపానికి వడిగట్టా రని నిలదీయగా తెలిసి, తెలియని ఆ మైనర్ కన్న తండ్రే చేశాడని, బయట ఎవరికి చెప్పవద్దు అన్నాడని చెప్పింది. దీంతో తల్లి కిన్నురాలైంది. ఆఘాయిత్యానికి పాల్పడ్డ భర్తపై ఫిర్యాధు చేసింది. ఒంగోలు పోలీసులు పూర్తి వివరాలు రికార్డు చేసి తాళ్లూరు పోలీసులకు పంపగా స్థానిక హెడ్ కానిస్టేబుల్ దాసు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పోక్సోచట్టంకింద కేసునమోదు చేశారు.
విచారణ చేపట్టిన దర్శి డిఎస్పీ బాల మురళీకృష్ణ….
కన్న కూతురిపై అత్యాచారంకు పాల్పడిన ఘటనపై నమోదయిన ఫోక్సో చట్టం లో నమెదయిన కేసుపై దర్శి పి.డిఎస్సీ బాలమరళీకృష ఆదివారం ఆగ్రామానికి వెళ్లి విచారణ నిర్వహించారు. గ్రామంలో బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి బాధితురాలిని విచారించారు. ఘటన జరిగినతీరు తెన్నులను, అన్ని వివరాలనుఅడిగి తెలుసు కుని స్టేట్ మెంట్ రికార్డుచేశారు. తల్లినుండి వివరాలు సేకరించారు. ఆయన వెంట స్థానిక ఎస్సై ఎస్.మల్లిఖార్జునరావులు వున్నారు.