తాళ్లూరులో స్కూల్ బస్సును దర్శి ఎంవీఐ రవి కుమార్ సోమ వారం తనిఖీ నిర్వహించారు. తాళ్లూరు- వెల్లంపల్లి రోడ్డులో తాళ్లూరుకు చెందిన ఓ పాఠశాల స్కూల్ బస్సు ఐస్ బండిని ఓవర్ టెక్ చేసి వస్తుండగా అకస్మాత్తుగా ఐస్ బండి ముందు వైపు ఉన్న వ్యక్తి ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుని కుడి వైపుకు రావటంతో స్కూల్ బస్సు తగిలి గాయపడి మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసారు. బస్సును తనిఖీ చేసిన ఎంవీఐ బస్సు కండిషన్ ను పరిశీలించారు. అన్ని పత్రాలు క్షున్నంగా పరిశీలించి డ్రైవర్ నాగరాజును ప్రమాదానికి గత కారణాలు అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు చేసారు.
స్కూల్ బస్సును తనిఖీ చేసిన ఎంవీఐ రవి కుమార్
13
Apr