రోడ్డుపై గుంతలు పూడ్చి వాహనదారుల చింతలు తీర్చిన ట్రాఫిక్ ఏసిపి శంకర్ రాజు.

బేగంపేట ఏప్రిల్ 13 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
తిరుమలగిరి ఎక్స్ రోడ్డు సమీపంలో రోడ్డుపై గుంతలు పూడ్చి వాహనదారుల చింతలు తీర్చారు తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి శంకర్ రాజు.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం 4వ దశను 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, మొదటి రోజు కార్యక్రమం తిరుమల గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పరిధిలోని ఆర్.పీ. పంప్, తిరుమలగిరి ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమం మల్కాజ్ గిరి డి సి పి ట్రాఫిక్ 1 రాహుల్ రెడ్డి, పర్యవేక్షణలో, తిరుమల గిరి ట్రాఫిక్ ఏ సి పి జి. శంకర్ రాజు, ఏసీపీ, ఆధ్వర్యంలో జరిగింది.రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు మరియు వాహన దారులు ప్రయాణం సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, ముందుగా అక్కడి గుంతలను పూడ్చివేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి రిజర్వు ఇన్స్పెక్టర్ ఐ.వి. రామనయ్య, ట్రాఫిక్ సబ్-ఇన్స్పెక్టర్లు మరియు లా & ఆర్డర్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *