గ్రామాల్లో జరుగుతున్న ఓటర్ల సమగ్ర విచారణలో వివిధ పార్టీలకు చెందిన బిఎల్ఎలు బిఎల్వోలకు సహకరిం చాలని తహసీల్దార్ బి.వి.రమణారావు కోరారు. తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయలో బిఎల్ఏలకు సర్ పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారన్నారు. ఇచ్చిన ఫారాలను సమగ్ర సమాచారం తో పూర్తి చేసి తిరిగి బిఎల్వోలకు అందజేయాలన్నారు. బియల్ఎలు వారికి సహకారిగా వుండివారికి సంబందించిన ఓటర్ల సమాచార ఆధారాలను అందజేయాలన్నారు. బిఎల్వోలు ముందుగా అందరికి ఫారాలు అందజేయగా మూడు సార్లు ఓటర్ల ఇంటికి వచ్చి సేకరిస్తారన్నారు. 2002 ఓటర్ లిస్టులో ఓటు వుంటే మ్యాపింగ్ చేయాలన్నారు.
2002 ఓటర్ లిస్టులో ఓటు వుంటే మ్యాపింగ్ చేయాలన్నారు. నిత్యం గ్రామాల్లో సర్ లో వుంటున్న బిఎల్వోలు, బిఎల్ఎలు సమ స్వయంతో పారదర్శకంగా ఓట్లసమగ్ర విచారణ జరిగేలా చూడాలన్నారు.ఈ కార్యక్ర మంలో మండల ఎలక్షన్ సెల్ సీవో సుజాత తదితరులు పాల్గొన్నారు.

