తాళ్లూరు: స్థానిక ఎన్నికలలో నామినేషన్లు నిర్భయంగా దాఖలు చేసుకోవచ్చని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. తాళ్లూరులో నామినేషన్ల ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. నామినేషన్ కు ఎవరైనా ఆటంకం కలిగించనా, ఇబ్బందులకు గురిచేసినా నమాచారం ఇవ్వాలని వారిని పోలీన్ వాహనంలో తీసుకువెళ్లి నామినేషన్ వేయించనున్నట్లు చెప్పారు. పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున నామినేషన్ కేంద్రాల వద్ద గుమికూడవద్దని తెలిపారు. పలువురి వికే కళాశాల ప్రాంగణంలో ఇతర చోట్ల ఉన్న వారికి అక్కడ నుండి పంపించి వేసారు. పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, నామినేషన్ కేంద్రాల పరధిలో గుంపులుగా లేకుండా చూడాలని, డ్రోన్, సీసీ కెమోరాల ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు. పోలీసులు, విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో పనిచెయ్యాలని కోరారు. ఎన్పీ వెంట డీఎస్పీ బాల మురళీ క్రిష్ణ, ఎన్ బి ఇన్స్ఫెక్టర్ శ్రీనివాస రావు, సీసీఎన్ సీఐ కమలాకర్, తాళ్లూరు, ముండ్లమూరు ఎస్సైలు మల్లిఖార్జున రావు. కోటేశ్వర రావు, స్పేషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు.
తాళ్లూరులో మండలంలో 32 నామినేషన్లు దాఖలు
మండలంలో 14 ప్రాదేశికాలకు గాను టిడిపి, వైసీపీ, బిజేపి, జనసేన పార్టీ నుండి మొత్తం 32 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్ జి దేవనహాయం తెలిపారు. అందులో తూర్భుగంగవరం -1లో టిడిపి నుండి ఒకటి, వైసీపి, బిజేపి తరపు ఒక్కక్క నామినేషన్ దాఖలు అయ్యాయి. తూర్పుగంగవరం-2 నుండి టిడిపి నుండి, వైసీపీ నుండి ఒక్కక్క నామినేషన్, మన్నేపల్లి టిడిపి ఒకటి, మల్కాపురం టిడిపి నుండి ఇద్దరు. జనసేన నుండి ఒకరు. లక్కవరం, తాళ్లూరు-2 నుండి టిడిపి నుండి ఇరువురు, వెలుగు వారి పాలెం వైసీపీ ఒకటి, శివరామపురం టిడిపి ఇరువురు, వైసీపి నుండి ఒకరు, నాగంబొట్ల పాలెం టిడిపి నుండి ఇరువురు, వైసీపీ నుండి ఇరువురి చొప్పున, తురకపాలెం వైసీపీ ఒకటి, మాధవరం టిడిపి ఒకరు నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరించారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: