బ్యాలెట్ పేపర్ల ముద్రణాలయాలను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి శనివారం సందర్శించారు .ఈ సందర్భంగా ఆమె బ్యాలెట్ పేపర్ రక్షణ గురించి సంబంధించిన సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందజేశారు. బ్యాలెట్ పేపర్ కు సంబంధించి ప్రింటింగ్ విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సంబంధించిన నోడల్ అధికారి dwma పీడీ విజయ్ కుమార్ కి సూచించారు. బ్యాలెట్ పేపర్ల రక్షణ కోసం 24 గంటలు నిరంతర నిఘా మరియు పర్యవేక్షణ ఉండేకలెక్టర్ dwma సిబ్బందిని మరియు పోలీస్ సిబ్బంది ఏర్పరచుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. రేపు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో దానికి సంబంధించి అభ్యర్థులపరంగా ముద్రణకు అనుగుణంగా అందించవలసిన పత్రాలు గురించి జాగ్రత్తలు గురించి వివరంగా వివరించారు. వార్డు మరియు మేయర్ ఎన్నికలకు సంబంధించిన పత్రాలను అందించడం జరిగిందనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: