అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన లూయి – దివ్యాంగులకు దుస్తులు పంపిణి

అంధులకు ప్రత్యేక లిపిని కనుగొని వారి జీవితాల్లో జీవితాల్లో వెలుగులు నింపిన లూయి చిరస్మరనీయుడని వక్తలు అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో బుధవారం లూయి బ్రెయిలీ 124వ జయంతి వేడుకలు నిర్వహించారు. ది ప్రకాశం జిల్లా ఎస్సీ, ఎస్టీ మైనార్టీ హెల్త్ అండ్ వేల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దర్శి భవిత కేంద్రంలో దివ్యాంగులకు దుస్తుల పంపిణీ నిర్వహించారు. షేక్ కార్పేరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ భాషా లూయిస్ బ్రెయిలీ ఘనతను వివరిస్తూ చూపు వలన జరిగే నష్టము కొద్దిగా గానే ఉంటుందని వారి పరిభాషలో తెలుపుతూ తల్లిదండ్రుల ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు .తహసీల్దార్, శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. .. లూయిస్ బ్రెయిలీ అంధుడైనను ప్రపంచ అందులకు జ్ఞానక వాటాలను ప్రసాదించిన మహనీయుడని కొనియాడారు మండల విద్యాశాఖ అధికారి రఘురామయ్య మాట్లాడుతూ .. అందరికీ విద్య అందరితో విద్య అనే నినాదంతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను కూడా ప్రతి పాఠశాలలో చేర్చుకోవాలని వారు తెలియజేసినారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే వైకల్యం అనేది అడ్డు రాదని అన్నారు . షేక్ కార్పేరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎస్. ఎం భాష ఆధ్వర్యంలో తహసీల్దార్, శ్రావణ్ కుమార్, ఎంఈఓ రఘురామయ్య, ఎండీపీఓ కుసుమకుమారి, సంఘ సేవకుడు జివి రత్నం దివ్యాంగులు 40 మందికి దుస్తులు పంపిణీ చేసారు. లూయిస్ బ్రెయిలీ జీవిత చరిత్రను వక్తలు వివరించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పేర్లు కమలాకర్ దివ్యాంగులకు స్వీట్లు పంపిణీ చేసారు. ఐఈడీ ఉపాధ్యాయులు గోపాలుని సుబ్రమణ్యం, శ్రీనివాసులు, సంఘ అధ్యక్షుడు ఓబయ్య, దళిత సేన బాధ్యులు ప్రేమకుమార్, మార్క్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *