రహదారి భద్రతకు డ్రైవర్లు ప్రధాన్యం ఇవ్వాలని ఎంవీఐ రవికుమార్ సూచించారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో 34వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. అందులో భాగం గా మొదటి రోజు డ్రైవర్లకు అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఎంవీఐ రవి కుమార్ మాట్లాడుతూ … వాహనాలు అతివేగంగా నడపడం, మద్యం తాగి వాహనాలు నడపడం మానుకోవాలని డ్రైవర్లకు సూచించారు. అనుమతి మించి ఎక్కువ మంది ప్యాసింజర్లను ఎక్కించుకుంటే వాహన సామర్థ్యం తగ్గి ప్రమాదాల బారిన పడతారని చెప్పారు. అనంతరం రహదారి భద్రతకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు.
రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి -కరపత్రాలు ఆవిష్కరించిన ఎంవీఐ రవికుమార్
19
Jan