దర్శి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో గురువారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టటర్ బి ఆర్ అంబేత్కర్ వద్ద రాష్ట్రదళితసేన ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఏ ఎస్ డబ్ల్యూ ఓ పరిధిలో ఉన్న దళిత డప్పు కళాకారులకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 23తారీఖున ఏ ఎస్ డబ్ల్యూ దర్శి వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం అధ్యక్షులు కండ్లకుంట మార్కు తెలిపారు.
రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ …. ఎస్ డబ్ల్యూ ఆఫీస్ పరిధిలో ఉన్న పొదిలి మండలం పాములపాడు, దర్శి మండలం బొట్లపాలెం, బండి వెలిగండ్ల, కట్టుబడిపాలెం, చలివేంద్రం తదితర గ్రామాలలో అర్హులైన దళిత డప్పు కళాకారులు ఉన్నప్పటికీ గ్రామ సచివాలయం నుండి దర్శి ఏ ఎస్ డబ్ల్యూ ఓ ఆఫీసుకు ఒకరి మీద ఒకటి చెప్పుకొని అర్హులైన వారికి పెన్షన్ అందుకున్న చేస్తున్నటువంటి అధికారుల నిర్లక్ష్యం నిదర్శనంగా సోమవారం ధర్నా కార్యక్రమం దళిత డప్పు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదo చేయాలని ఆయన కోరినారు ఈ కార్యక్రమంలో మాదిగ మహానాడు దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ గట్టుపల్లి ప్రసాదు, గండి విజయభాస్కర్, బిచ్చం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.