రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు శుక్రవారం మాజీ ఎమ్మెల్యేనారపుశెట్టి పాపారావు, నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యలను కలసి తనకు పదవి రావానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి శాగం కొండా రెడ్డి, సర్పంచి కొర్రపాటి శ్రీదేవి రామయ్య, గ్రామపార్టీ అధ్యక్షుడు కొమ్మినేని లక్ష్మినారాయణ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
