జీవన ఎరువులను అధికంగా ఉపయోగించుకోవాలి- మిరపలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

మిరపలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి మంచి దిగుబడులు పొందాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. కొర్రపాటి వారి పాలెంలో సాగు చేసిన మిరప పంటను ఆయన శనివారం పరిశీలించారు. మిరపలో తామర పురుగు నియంత్రకు సూడోమోనాస్ 20 గ్రాములు లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారి చెయ్యాలని మరియు 5 శాతం వేప గింజల కషాయాన్ని, సర్ఫ్ పౌడర్ లేదా, కుంకుడు రసంతో గాని కలిపి పిచికారి చెయ్యాలని కోరారు. జీవన ఎరువుల తక్కువ ఖర్చుతో సస్యరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కానుక నూనె 2 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చెయ్యాలని అవసరమైన మేరకు పంట దశలో కూడ నూనె తీయని వేప చెక్క వేసుకోవటం ద్వారా భూమిలో ఉండే ప్యూపా దశను నివారించుకోవచ్చని అన్నారు. రసాయనిక పురుగు మందుల పిచికారి తగ్గించటం ద్వారా మిత్ర పురుగుల ఉదృతిని పెంచవ్చని వివరించారు. జీవన ఎరువుల వినియోగం ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి కూడ ఎందో దోహదం చేస్తుందని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *