జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడాల బాలకృష్ణ, 30 మంది సభ్యులతో కలసి ఆదివారం BRS పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీసీ లకు న్యాయం చేస్తున్నది BRS మాత్రమేనని, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్,నిత్యం ప్రజల మధ్య ఉండే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పనితీరుకు ఆకర్షితులైయ్యామని బాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తలసాని సాయికిరణ్ యాదవ్, మహేష్ యాదవ్, ఇంచార్జీ జీ పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం రాజు, కార్యదర్శి మహేందర్, శ్రీకాంత్ రెడ్డి, ముక్క శ్రీను, మెదక్ జిల్లా రాజక సంఘం అధ్యక్షుడు సంగు స్వామి పాల్గొన్నారు.
