బాలల దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు

నవంబర్ 14 వ తేదీ బాలల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకట కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో దర్శి లోని పొదిలి రోడ్లో గల గీతాంజలి డిగ్రీ కళాశాల నందు ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాస్థాయిలో జరిగే ఈ వ్యాసరచన పోటీలలో పదవ తరగతి లోపు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని విద్యార్థులకు నచ్చిన అంశంపై వ్యాసరచన చేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు. నవంబర్ 19వ తేదీ డిగ్రీ కళాశాల ఆవరణలోనే వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వివరాల కొ ప్రతాప్-9381446889, సుదర్శన్రెడ్డి 63037 32640 సెల్ నెంబర్లకు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *