తాళ్లూరు మండలంలో దీపావళి పండుగను సోమవారం సందడిగా నిర్వహించారు. చిన్నారులకు ఇష్టమైన పండుగ కనుక ఎక్కువగా చిన్నారులు దీపావళి సామగ్రిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపారు. ప్రత్యేకంగా అనుమతి పొందిన కౌంటర్లలో మాత్రమే దీపావళి సామగ్రిని అమ్మకాలు జరిపారు. కొత్తపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కొవ్వోత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. మండలంలోని ప్రజా ప్రతినిథులు, పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖలు వారి నివాసాల వద్ద ఆనందోత్సవాల మధ్య దీపావళి పండుగను జరుపుకున్నారు.

