పేదలకు దీపావళి ని పురష్కరించుకుని స్వంత నగదుతో చేయూత ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ – ఒంగోలు బలరాం నగర్ కాలనీలో చిత్త కాగితాలు ఎరుకుంటున్న వంద కుటుంబాలకు దుస్తులు, దీపావళి సామగ్రి, స్వీట్స్ అందజేత

రెక్కాడితే కాని డొక్కాడని కడు పేద కుటుంబాలకు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కమార్ దీపావళి కాంతులు నింపారు. ఒంగోలులో బలరాం నగర్ కాలనీలో చిత్తు కాగితాలు ఎరుకుంటూ జీవనం సాగిస్తున్న వంద కుటుంబాలను జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ సందర్శించారు. అక్కడ నివసిస్తున్న వారికి తన స్వంత నగదుతో చీరలు, పంచెలు, దోవతి, స్వీట్లు, దీపావళి సామగ్రిని అందించారు. వారి కుటుంబ స్థితి గతులు, చిన్నారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా మరింత చేయూత అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం వృద్ధాశ్రమాన్ని సందర్శించి పది మంది వృద్ధులకు దుస్తులు, స్వీట్లు పంపిణీ చేసారు. ఆర్డిఓ విశ్వేశ్వర రావు, మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ కమీషనర్ ఎం వెంకటేశ్వరరావు, స్థానిక కార్పోరేటర్ ధనలక్ష్మిలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *