బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తూర్పుగంగవరం, మాధవరం ఆర్ అండ్ రోడ్డులో ఉన్న పలు గుంటలు, తూర్పు గంగవరం, దారం వారి పాలెం రోడ్డులో హరిదాస్ కాలనీ వద్ద ఉన్న బురద గుంటకు మోక్షం లభించింది. నెలల తరబడి ఈ సమస్యలను ఎదుర్కొంటున్న వాహనదారులు, ప్రజలు బూచేపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా సమస్యలపై దారం వారి పాలెం గ్రామానికి చెందిన మన్నేపల్లి సర్పంచి వెంకటేశ్వర రెడ్డి, మాధవరం వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించి వారు జెడ్పీ నిధులు దారం వారి పాలెం పీఆర్ రహదారికి మంజూరు చేసారు. ఆర్ అండ్ బి రోడ్ కు స్వంత నిధులతో కంకర దువ్వను తోలి చదును చేయించారు. దీంతో ఆయా రోడ్లలో రవాణా సాఫీగా సాగటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ బూచేపల్లికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.



