జిల్లాలో బిజెపి పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి- పీవీ శివారెడ్డి – బిజెపి కిసాన్ మోర్చా జిల్లా నూతన కార్యవర్గ నియామకం.

భారతీయ జనతా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గాన్ని మంగళవారం స్థానిక విష్ణు ప్రియ కన్వెన్షన్ హాల్లో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బొంతల కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎంపిక చేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలను కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గంలోకి ఆహ్వానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ మేరకు బిజెపి జిల్లా కిసాన్ మోర్చా కమిటీ లో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బొంతల కృష్ణ, ప్రధాన కార్యదర్శులుగా శాతరాజుపల్లి చంద్రశేఖర్, భగత్ వినోద కుమార్, ఉపాధ్యక్షులుగా రామకృష్ణారెడ్డి, గంగిరెడ్డి ఆది నారాయణరెడ్డి, తికనం లక్ష్మినారాయణ, తోట్ల యల్లారెడ్డి, కార్యదర్శులుగా మురళి మోహన్ రెడ్డి, మారం రెడ్డి ప్రతాపరెడ్డి, పువ్వాడ నారాయణ, అల్లూరి రాజేష్, కొరపాటి సుబ్బారావు లు మరియు కోశాధికారి గా వంకదారి రమేష్ కుమార్ లకు నియామక పత్రాలు అందించారు.

వీరిని అభినందించిన పీవీ శివారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పటిష్టతకు, జిల్లాలో అత్యధిక స్థానాలలో విజయం సాధించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ రవిశంకర్, బాపట్ల జిల్లా ఇంఛార్జ్ పి.వి కృష్ణారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తానికొండ సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *