ఆగస్టు 17వ తేదీ విశ్వకర్మ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతివృత్తుల వారికి 13 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించి వారి అభివృద్ధికి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మీడియా ఇన్ఛార్జి ధనిశెట్టి రామునాయుడు తెలిపారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టి శ్రేణులకు ఇచ్చిన పిలుపుమేరకు ఒంగోలు నగరంలోని చిన్న సన్న కారు చేతివృత్తుల వారిని కలిసి విశ్వకర్మ యోజన పథకం పై వారికి అవగాహన కలిగించారు. అంతేకాకుండా వారిని పూర్తి వివరాలను తో విశ్వకర్మ యోజన పథకానికి అవసరమైన వివరాలతో సిఎస్సి సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల ఉన్నతి కోసం అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను అట్టడుగు వర్గాల దాకా చేరే వరకు విస్తృతంగా కృషి చేయాలని, అప్పుడే ప్రజలలోకి పార్టీ వెళుతుందని, పటిష్టమవుతుందని తెలిపారని ధనిశెట్టి రామునాయుడు పేర్కొన్నారు. విశ్వకర్మ యోజనలో దేశంలోని 18 రకాలుగా ఉన్నటువంటి చేతివృత్తుల పనివార్లకు ఈ పథకం వర్తిస్తుందని, ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు వారు తెలిపారు.

