ఘనంగా నేహ్రు జయంతి నిర్వహణ – ఉత్సాహంగా చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహణ

తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేహ్రూ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డిలు చాచాజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంఈఓ సుబ్బయ్య, వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నివాళులు అర్పించారు. వక్తలు చిన్నారులతో నెహ్రూకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరు, తూర్పు గంగవరంలలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపుపొందిన పాఠశాలలో నేహ్రు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా తాళ్లూరులో ఎబీసీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం వెంకటేశ్వరరావు, తూర్పు గంగవరం జాహ్నవి స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు చెన్నారెడ్డిలు నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *