మేలైన యాజమాన్య పద్ధతులతో ఖర్చులు తగ్గించుకుని మంచి దిగుబడి పొందవచ్చని డిఆర్సీ జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి శేషమ్మ తెలిపారు. చీమకుర్తి మండలం పాటిమీదపాలెంలో రైతు కోటయ్య పొలంలో శనివారం ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ రెండవ వారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శాతం వేపగింజల కషాయం తయారీ, దాని ఉపయోగాలు, అజోల్లు జీవన ఎరువు తయారీ, దాని ఉపయోగాలు, వరిలో జింకు ధాతు లోపం, ఉల్లికోడు లక్షణాల నివారణ, జీవశిలీంద్ర నాశిని వాడే విధానం ఉపయోగాలు వివరించారు. అజోల్లాను వరి పొలంలో వేయించటం కాండం తొలుచు పురుగు నివారణ లింగాకర్షక బుట్టను అమర్చి మిగిలిన రైతులకు అవగాహన కల్పించారు. ఉల్లికోడ సమస్యను గమనించి నాట్లు వేసిన పది, పదిహేను రోజుల లోపల ఫిప్రోనిల్ 0.3శాతం గుళికలు ఎకరానికి పది కిలోల చొప్పున వేయ్యాలని సూచించారు. పంటపై ఉల్లికోడ గమనించిన వెంటనే ఫ్రిఫ్రోనిల్ 400 మి. లీ ఒక ఎకరానికి పిచిచారి చేయవలసినదిగా సూచించారు. చీమకుర్తి ఎవో డివి భాస్కర్, విఏఏ శృతి తదితరులు పాల్గొన్నారు..

