20వ తేదీ సోమవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్థానిక విష్ణు ప్రియ కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు జరుగుతుందని ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులు పీవీ శివారెడ్డి తెలిపారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరుగు సమావేశములో కేంద్ర మంత్రులు, రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశాలకు ప్రకాశం జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, వివిధ మోర్చాల కన్వీనర్లు, తదితర జిల్లా స్థాయి నాయకులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
