దాసారం గుడిసె వాసులకు పక్కా ఇండ్లను నిర్మించి ఇస్తామని సనత్ నగర్ MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. సోమవారం సనత్ నగర్ లోని సాయిబాబా నగర్, దాసారం బస్తీ, LIG, C టైప్ క్వార్టర్స్, దాసారం హట్స్ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయనకు మహిళలు మంగళహారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్బంగా దాసారం బస్తీ గుడిసె వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అత్యంత నిరుపేదలు నివసించే ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తూ వచ్చామని, స్థలం విషయం కోర్టులో కేసు నడుస్తుందని, తప్పకుండా కేసును మనమే గెలుస్తామని వారి దైర్యం చెప్పారు. కేసు పరిష్కరామైన తర్వాత ఉచితంగా పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. మీకు ఏ అవసరమొచ్చిన తానున్నాను అనే విషయాన్ని మరవద్దని చెప్పారు. ఓట్ల కోసం ఎవరెవరో వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం, వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్, ఇల్లు లేని పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు BRS పార్టీని బలపర్చాలని అన్నారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 400 రూపాయలకు గ్యాస్ సిలెండర్, రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ, 15 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించబడుతుందని వివరించారు. ప్రచారంలో మంత్రి వెంట కార్పొరేటర్ కొలను లక్ష్మి, డివిజన్ BRS అద్యక్షులు కొలను బాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శేఖర్, నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్ గౌడ్, ప్రవీణ్, రాజేష్, భద్రయ్య , పుష్పలత, ఝాన్సీ తదితరులు ఉన్నారు.
BRS లో చేరిక
ప్రచారంలో భాగంగా దాసారం బస్తీ, దాసారం హట్స్ ప్రాంతాలలో సుమారు 80 మంది వరకు యువకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో అభిమన్యు, నవీన్, అంజన్, సత్యనారాయణ, గణేష్, వంశీ, బాలు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.




