కస్తూరిబా పాఠశాలలో సోమవారం బాలికా హక్కులు, బాల్యవివాహాలపై అధికారులు అవగాహన కల్పించారు. కెజిబివి ప్రిన్సిపాల్ సుజిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ జ్యోతి, మహిళా పోలీస్ భవాని, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
