రైతులు ఉత్తమ యాజమాన్య పద్దతులు పాటించాలి – ఆత్మ పిడి అన్నపూర్ణ

రైతులు ఉత్తమ యాజమాన్యపద్దతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయని ఆత్మ పిడి కె అన్నపూర్ణ తెలిపారు. చీమకుర్తి మండలం కెవి పాలెంలో పలు పంటలను సోమవారం పరిశీలించారు. మిరప, కంది, పొగాకు వరి పొలాలను పరిశీలించి ప్రస్తుతం ఆయా పంటలకు ఆశించిన పలు తెగుళ్లను, పురుగులను గమనించి నివారణ చర్యలను సూచించారు. సాగు ఖర్చును తగ్గించుకోవాలని చెప్పారు. కందిలో కళ్లెకు రాక ముందే ఎసిఫెట్ వంటి మందులతో పాటు వేప నూనె కలిసి వాడినట్లయితే మారక మచ్చ పురుగు ఉధృతి ఉండదని చెప్పారు. డిఆర్సీ ఎఓ వివి శేషమ్మ, ఎఈఓ వెంకటేశ్వర్లు, విఏఏలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *