ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలకు ఊరట కల్పించిన ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలుపుతూ ఆపుస్మా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలకు, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన యూనియన్ నాయకులు- వారిని కలసి ప్రత్యేకంగా సన్మానం- సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపిన ఎమ్మెల్సీ కల్పలత

రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల గుర్తింపును మూడు సంవత్సరాల నుండి 8సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటంలో, జీఓ నంబర్ 90 విడుదల చేయటంపై యూనియన్ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రా రెడ్డి సూచనల మేరకు అపుస్మా సభ్యులు క్రిష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టి కల్పలత ను కలిసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ ఎమ్మెల్సీల అందరె కృషితో ఈ జీవో సాధ్యమైనదని, ఇందుకు అంగీకరించిన సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, విద్యాశాఖ మంత్రి బోత్ససత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ను కలిసి ధన్యవాదాలు తెలిపి సత్కరించారు. అదే విధంగా ఎమ్మెల్సీ కల్పలత ఆధ్వర్యంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశన్ను కలిసి ధన్యవాదాలు తెలిసి ఘనంగా సన్మానించారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో అపుస్మా ప్రిన్సిపల్ అడ్వయజర్ పోతి రెడ్డి, రీజినల్ జోనల్ ప్రిసిడెంట్ సుబ్బారావు, స్టేట్ కన్వినర్ విజయకుమార్, అపుస్మా నాయకులు హనుమంతరావు, మాధవరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షుడు కె. ఆర్ ఎస్ రావు, గుంటూరు జిల్లా అపుస్మా నాయకులు కృష్ణారావు, కో ఆర్డినేటర్ వంశీ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *