రాష్ట్ర కార్యవర్గ సమావేశం దిగ్విజయానికి ధన్యవాదములు – బిజేపి జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి.

ప్రకాశం జిల్లా ఒంగోలులో తొలిసారిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటుకు అంగీకరించిన రాష్ట్ర బిజెపి అధిష్టానానికి మీడియా ద్వారా ధన్యవాదములు తెలిపిన పివి శివారెడ్డి. సోమవారం స్థానిక విష్ణుప్రియా కన్వెంషన్ హాలు లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, కేంద్ర మంత్రులు, పార్టీ పదాధికారులు, రాజ్యసభ సభ్యులు, జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్న సమావేశంలో 1500 మందికి పైగా రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన పార్టీ నాయకులకు ఎలాంటి లోటు లేకుండా కార్యనిర్వహణ చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జ్ మరియు జిల్లా నాయకులకు పేరుపేరునా పీవీ శివారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం సురక్షితంగా సుశిక్షితంగా జరగడానికి సహకరించిన జిల్లా పోలీస్ అధికారులకు మరియు సమావేశం లోని ప్రతి అంశాన్ని సూక్ష్మంగా తమ కథనాల ద్వారా ప్రాచుర్యం తెచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం దిగ్విజయంతో జిల్లా లో పార్టీ మరింతగా బలం పుంజుకుందని రాబోయే ఎన్నికలలో పార్టీ విజయం సాధిస్తుందని ధీమాగా తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *