గత ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో విఫలమైన బీ ఆర్ ఎస్ పార్టీని ఈ ఎన్నికల లో ఓడించాలని సనత్ నగర్ బీ జే పీ ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి కోరారు.ఎన్నికల ప్రచారం లో భాగంగా మంగళ వారం కృష్ణానగర్ కాలనిలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం కమ్యూనిటీ హాలు నిర్మాణం చేస్తామని చెప్పారని.అది ఇప్పటికే శిలా ఫల కానికే పరిమితం చేశారన్నారు. పీజీ రోడ్ లో ప్రధాన రహదారి మాత్రమే వైట్ టాపింగ్ రోడ్డు వేయడంతో కాలనీల రోడ్డు లోతట్టుగా మారాయన్నారు.దీని వల్ల లోతట్టు గా వుండటం తో నీళ్లు నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్నరు. వెంకట్రావు నగర్ కాలనీ, బాపుబాగ్ కాలనీ , సింది పార్కు ఎదురుగా వర్షం పడిన ప్రతిసారి వరద నీరు ముంచెత్తుతుందన్నారు. బాపుబాగ్ కాలనీ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. కానీ కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకునే మంత్రికి ఇవి కనిపించవా ?..సింది కాలనీ పార్కు రూపు రేఖలు మారిపోయాయి, పచ్చదనమే లేదు, జవహర్ నగర్ పార్కు, కృష్ణానగర్ పార్కు పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఎప్పుడైనా ఈ పార్కుల గురించి పట్టించుకున్నారా అని మర్రి ప్రశ్నించారు.

