అవినీతికి తావులేని పాలన జగన్ కే సాధ్యం -నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే పథకాలు – ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024 ఎన్నికల్లో మళ్లీ సీఎం అయితేనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ అన్నారు. దర్శి మండలంలోని చందలూరు, రాజం పల్లి గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాలకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ మంగళవారం హాజరయ్యారు. ఎమ్మెల్యే మద్ది శెట్టి డాక్టర్ వేణుగోపాల్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరిం చారు. జరిగిన అభివృద్ధి కరపత్రాలు విడుదల చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ… అవినీతికి తావులేని పాలన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమైందని చెప్పారు. ఏ పధకం అయినా ఎవరి ప్రమేయంతో పనిలేకుండా నేరుగా అబ్దిదారుల ఖాతాలకు జమయ్యేయని పేర్కొన్నారు. మీకు మేలు జరిగితేనే నాకు ఓటెయ్యండి అని ఓటు అడిగే దమ్మున్న ముఖ్యమంత్రి దేశంలో ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కె సాధ్యమైందని చెప్పారు. ఇలాంటి దమ్మున్న నాయకుడు పార్టీలో ఉండటం తమ అదృ ష్టం అని స్పష్టం చేశారు. ఎంపీపీ సుధాఅచ్చయ్య, ఎంపీడీఓ కుసుమకుమారి, సచివాలయాల జేసీఎస్ మండల కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి (మహేష్), గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సం క్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీనాబాషా, పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, సర్పంచ్ అన్నపూర్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *