నిరుద్యోగులకు స్కిల్ హబ్ వరం లాంటిదని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎస్ డీసీ స్కిల్ హబ్ ను ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ముందుగా అద్దంకి రోడ్డులోని రామాలయం గుడి వద్ద మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ వారు నిర్వహించిన స్టాల్స్ ను ప్రారంభించి స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం స్కిల్ హబ్ ను ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కిల్ హబ్ ను ఏర్పాటు చేశారన్నారు. స్కిల్ హబ్ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించడమే కాకుండా వారికి తగు ఉద్యోగాలను కూడా కల్పిస్తా రన్నారు. క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, మెళకువలతో ఉద్యోగంలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా ఉపాధి అధికారి టీ భరద్వాజ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టు ఇక్కడ యువతకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం శుభపరిణామం అన్నారు. అందరూ చక్కగా నేర్చుకుని రాణించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ ఎస్ సావిత్రి మాట్లాడుతూ స్కిల్ హబ్ ద్వారా అసోసియేటెడ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులు మూడు నెలల శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. రెండో విడతలో రెండు బ్యాచ్ల ద్వారా 60 మంది శిక్షణ పొందుతున్నార న్నారు. కార్యక్రమంలో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మండల కన్వీనర్ వెన్న పూస వెంకటరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్య క్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నా రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ఫీ రమణ, నగేష్, స్కిల్హాబ్ ఇన్చార్జ్ షేక్ ఈస్ బాషా, ప్లేప్మెంట్ అధికారి శ్రీనివాసాచారి, హెచ్ అండ్ ఎమ్ఐఎస్ ఫిరోజ్, జే సురేష్ తదితరులు పాల్గొన్నారు.






