ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల గుర్తింపు రెన్యువల్ కాలం మూడు సంవత్సరాల నుండి 8సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం జీవో నంబర్ 90ని విడుదల చేయటంపై ఆంధ్రప్రదేశ్ ప్రవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మెనేజ్మెంట్ అసోషియేషన్ (అపుస్మా) సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఒంగోలు ఎంసీఏ భవనంలో మంగళవారం అపుస్మా సంఘం మీడియా సమావేశం నిర్వహించారు. అపుస్మా జోనల్ అధ్యక్షుడు ఎవీ సుబ్బారావు మాట్లాడుతూ …ఈజీవోతో అనేక ప్రవేట్ పాఠశాలకు ఉపయుక్తకరంగా ఉందని అందుకు సహకరించిన ఎమ్మెల్సీలు ఎంవి రామచంద్రా రెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత లకు కృతజ్ఞతలు తెలిపారు. అపుస్మా జిల్లా అధ్యక్షుడు కె మాధవరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీల విన్నపంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి జీవో 90ని విడుదలకు సహకరించిన సీఎంకు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, విద్యాశాఖాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘ కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ… అపుస్మా సంఘ కృషితో అనేక పాఠశాలకు ప్రయోజనం చేకూరుతుందని, జీవో ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజక వర్గ అపుస్మా అధ్యక్షుడు నలంద ప్రసాద్, సెక్రటరి ప్రగతి స్కూల్ పరమేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
