పొగాకు బోర్డు అనుమతించిన మేరకు మాత్రమే పొగాకును రైతులు పండించాలని గుంటూరు పొగాకు బోర్డు ప్రొడక్షన్ మెనేజర్ డాక్టర్ ఎం క్రిష్ణశ్రీ అన్నారు. పొగాకు బోర్డు ఒంగోలు-2 పరధిలోని త్రోవగుంట, కరువది. వలేటి వారి పాలెం గ్రామాలలో పొగాకు తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్డు ఎంపిక చేసిన వంగడాలను (ఎఫ్సీఆర్-15, సిరి) మాత్రమే సాగు చెయ్యాలని చెప్పారు. నాణ్యమైన పొగాకు నారు మాత్రమే ఉపయోగించాలని కోరారు. ఈ వారం వాతావరణం మబ్బులతో కూడి ఉండటం వలన పచ్చ పురుగు, బొబ్బ తెట్టు వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఒంగోలు-2 వేలం కేంద్రం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ, బోర్డు ఎ.ఎస్ లు జె తులసి, శంకుతల తదితరులు పాల్గొన్నారు.



