తాళ్లూరు సరస్వతి హైస్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి, హెడ్మాస్టర్ శ్రీరామమూర్తి తెలిపారు. నవంబర్ 11,12వ తేదీల్లో తిరుపతిలో జరిగిన అండర్-16 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో సరస్వతి హైస్కూల్ విద్యార్థులు తొమ్మితో తరగతి చదువుతున్న బారెడ్డి ప్రసాద్, బత్తుల శ్రీనాథ్, ఆకుల మనోహర్, అభిలాష్‌లు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. వీరిని ఆ పాఠశాల చైర్మన్ ఏవీ రమణారెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.
