పలు దేవాలయాల నిర్మాణానికి ఆర్ధిక చేయూత ఇచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి – కృతజ్ఞతలు తెలిపిన గ్రామ పెద్దలు, నిర్మాణ క్రియాశీలక కార్యకర్తలు

దర్శి నియోజక వర్గంలో పలు దేవాలయాల, చర్చిల నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆర్థికంగా సహకరించి చేయూత అందించారు. దర్శి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయా గ్రామాలకు చేయూత నగదు గ్రామ పెద్దలకు, నిర్మాణ కార్యకర్తలకు అందించారు. ముండ్లమూరు మండలంలో ఈదర గ్రామ అంకమ్మ తల్లి దేవాలయానికి రూ. 1లక్ష రూపాయలు, కొత్తపల్లి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి రూ. 25వేలు, కురిచేడు తెలుగు బాప్టిస్ట్ చర్చికి రూ.20వేలు అందించారు. తమకు దేవాలయాల, చర్చిల నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టికి ఆయా గ్రామాల పెద్దలు, నిర్మాణ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *