గుర్తింపు పొందిన పాఠశాలలు. ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా అండగా ఉంటాఏ అవసరం వున్నా నేరుగా నన్ను కలవండి.ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలిపించండి…సనత్ నగర్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్హి.మంత్రి తలసాని.

సనత్ నగర్ నియోజక వర్గం పరిధి లోని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలు.ఉపాధ్యాయులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని.వారికి ఏ అవసరం వచ్చినా నేరుగా వచ్చి తనను కలవ వచ్చని సనత్ నగర్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వారు ఉపాధ్యాయులే అని అన్నారు. బుధవారం సనత్ నగర్ లోని AK గౌడ్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల అసోసియేషన్ ( TRSMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్ కు బంగారు బాట వేసేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రయివేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, నిర్వహకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ లు, పేదింటి ఆడపడుచు పెండ్లికి ఒక 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. పేద, మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కల మేరవేర్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు GHMC పరిధిలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 30 వేల ఇండ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. మళ్ళీ BRS ప్రభుత్వం వచ్చిన వెంటనే1 మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంతో పాటు రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. 1100 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలెండర్ 400 రూపాయలకు అందజేస్తామని, మిగిలిన 700 రూపాయలను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అదేవిధంగా బస్తీ దవాఖాన ల ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పరీక్షించి మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా అభివృద్ధి చేసి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా కోట్లాది రూపాయల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులో కి తెచ్చామని వివరించారు. ప్రయివేటు హాస్పిటల్స్ కు వెళ్ళి ఆర్ధికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ఉపాధ్యాయులకు అందించే విధంగా చూస్తానని ప్రకటించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న తనను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తమ సంపూర్ణ మద్దతు ను ప్రకటించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, సుధాకర్, ప్రశాంత్, పవన్ పాఠక్.ప్రసాద్, అల్తాఫ్ హుస్సేన్, పవన్, విజయ రామరాజు సోమ సుందర్.నాగరాజు. తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *