ఒంగోలులో అంగరంగ వైభవంగా సాగిన సామాజిక సాధికార యాత్ర – ఒంగోలు జిల్లా జగనన్న ఖిల్లా :ఆరోగ్య శాఖ మంత్రి విడదలు రజిని – పక్క రాష్ట్రాల మేనిఫెస్టోల్లోనూ మన పథకాలు: మంత్రి ఆదిమూలపు సురేష్‌- ఒడిశా, తమిళనాడు, కర్ణాటక ప్రజలు ఏపీలో కలవాలని కోరుకుంటున్నారు: ఎంపీ కృష్ణయ్య – గత పాలకులు చేసిన అప్పులతో ప్రజలకు చేసిన మంచేంటి?: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

సామాజిక సాధికార యాత్రతో ఒంగోలు పట్టణం దద్దరిల్లింది. జై జగన్‌ నినాదాలతో మార్మోగింది. వేలాది మంది జనం మధ్య బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఉత్సాహంగా ప్రసంగించారు. ఆద్యంతం ఇసకేస్తే రాలనంత జనం మధ్య యాత్ర సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, హఫీజ్‌ ఖాన్, కేపీ నాగార్జునరెడ్డి, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒంగోలు జిల్లా జగనన్న ఖిల్లా :ఆరోగ్య శాక మంత్రి విడదలు రజిని

సామాజిక సాధికారత అంటే ఎమిటో వేదిక మీద ఉన్న వైయస్ఆర్సీపీ నాయకులను అర్దమైవుతుందని దేశంలో మొదటిసారి చేసి చూపించిన వ్యక్తి జగన్ అని ఆరోగ్య శాఖ మంత్రి విడదలు రజిని అన్నారు. సామాజిక సాధికారత అంటే పేదవాడి ఇంటికి కార్పొరేట్‌ వైద్యం అందటమని, రేషన్‌ ఇంటి వద్దకు అందటమని, అన్ని పథకాలూ ఇంటి వద్దకే రావటమని, రాజధాని ఎక్కడో ఉండటం కాదని, గ్రామ గ్రామాన సచివాలయాల పరిపాలన ప్రజల ముందే అందుతున్నప్పుడు సామాజిక సాధికారత అని మంత్రి రజిన ఉద్ఘాటించారు. ఈ రాష్ట్రలో పేదవాడి బాగోగులు, పేదవాడి సంతోషమే ధ్యేయంగా పరిపాలిస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు.

అంబేద్కర్‌ కోరుకున్నట్లుగా జగనన్న పాలన: మంత్రి మేరుగ నాగార్జున

“ఒంగోలులో నేల ఈనిందా అన్నట్లు ప్రజానీకం వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అన్యాయం చేసి అసమానతలు, అఘాయిత్యాలు, దాడులు చేయించాడు. జగనన్న ఈ వర్గాలను గుండెల్లో పెట్టుకున్నారు. సామాజిక విప్లవానికి తెర తీశారు. అంబేద్కర్‌ కోరుకున్నట్లు పాలన చేస్తున్నారు. పేద వారి పక్షాన జగనన్న ఉన్నాడని, గుడ్డ కాల్చి ముఖంపై వేయాలని చూస్తున్న చంద్రబాబు. ఏ ఆస్పత్రికి వెళ్లినా చూపించుకొని వచ్చేలా ఖర్చులకు డబ్బులిస్తున్న జగనన్న. లక్షల ఇళ్లపట్టాలిస్తే అగ్ర తాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. రూ.2.40 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు పంచితే అగ్ర తాంబూలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. ఉద్యోగాలు ఇస్తే 78 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. ఇంతకు ముందెన్నడూ ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు. చంద్రబాబు మోసగాడు, 14 ఏళ్లు అబద్ధం రాష్ట్రాన్ని పాలించింది. నాలుగున్నరేళ్ల నుంచి ఒక నిజం పాలిస్తోంది. సామాజిక విప్లవం పరిఢవిల్లుతోంది. చంద్రబాబును నమ్మొద్దు, మోసగాడు, దగాకోరు. రాష్ట్రానికి జగనన్న సీఎం కావడం మనకు అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవసరం.”- మేరుగ నాగార్జున, మంత్రి

పేద ప్రజలకు ఆస్తులనిచ్చిన నాయకుడు జగన్: ఎంపీ కృష్ణయ్య

ప్రజలని చైతన్య వంతం చేసే యాత్రే,ఈ సామాజిక సాధికార యాత్రని రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య అన్నారు. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడు పక్క రాష్ట్రాల వారు ఏపీలో ఇస్తున్న పథకాలు చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ విద్యా వ్యవస్థ ఎంతో బాగుందని, 20 ఏళ్ల తర్వత ఏపీలోని బడుగు బలహీనవర్గాల పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా వెళ్తారన్నారు. జగనన్న అనేక పథకాలు తీసుకొచ్చారని, వెనుకబడిన వర్గాలు పైకి రావాలని ఆయన ఆకాంక్షని తెలిపారు. పేదలకు ఆస్తులనిస్తున్న ఏకైక నాయకుడు జగన్ అని అన్నారు.

జగనన్న పేదవాడి ప్రేమకు మాత్రమే బానిస తప్ప మరేవరికి కారు: ఎంపీ నందిగామ సురేష్

“ప్రతి కుటుంబంలో ఒక పెద్దలా, కుటుంబ సభ్యుడిలా, పెద్దకొడుకులా మారి మన సమస్యలు వింటున్న జగనన్న. జగనన్న ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. జగనన్నను మిస్‌ చేసుకుంటే రాక్షసుడు వస్తాడు. మనందరం ఇబ్బంది పడతాం. మన పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవాలన్నా, అవ్వాతాతలు పింఛన్లు సమయానికి తీసుకోవాలన్నా, నాడునేడు స్కూళ్లు బాగుండాలంటే, విద్యా, వైద్యం, పేదవాడి ఆరోగ్యం, రైతులు బాగుండాలంటే జగనన్న రావాలి. తనకున్న సంపద కాకుండా మన కంచంలో కూడు లాగేసుకోవాలనుకొనే వ్యక్తి చంద్రబాబు. సామాన్యుడు, వ్యవసాయ కూలీ కొడుకు గ్రీన్‌ ఇంకుతో సైన్‌చేసే అవకాశం వచ్చిందంటే జగనన్న కారణం. చంద్రబాబును నమ్మి బాగుపడిన వ్యక్తి లేరు. వైయస్‌ ఫ్యామిలీని నమ్మి చెడిపోయిన వారు లేరు. జగనన్న పేదవాడి ప్రేమకే బానిస తప్ప ఎవడికీ బానిస కాదు” అని ఎంపీ నందిగామ సురేష్ అన్నారు

గత పాలకులు చేసిన అప్పులతో ప్రజలకు చేసిన మంచేంటి?: బాలినేని శ్రీనివాసరెడ్డి

తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లక్షల కోట్లు అప్పలు చేశారు, జగనన్న ప్రభుత్వంలో ఎన్ని అప్పులు చేశాడో ప్రజలు గమనించాలని మాజీ మంత్రి బాలినేని కోరారు. చంద్రబాబు చేసిన అప్పులతో ప్రజలు చేసిన మేలు ఎంటి అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికలకు జగనన్న ఇంకా ఎటువంటి పథాకుల తీసుకువస్తారో అని ప్రజలు ఎదురు చేస్తున్నారని చెప్పారు. జగనన్న మాట తప్పడు మడం తీప్పడని తెలిపారు. ఒంగోలు మంచి చేసింది జగనన్న మాత్రమే అని తెలిపారు

“ఒంగోలులో రూ.350 కోట్లతో మంచి నీటి పథకం తెచ్చాం. త్వరలో సీఎం ఒంగోలు వస్తారు. ఆ పథకాన్ని శంకుస్థాపన చేస్తారు. రిమ్స్‌ ఏర్పాటు చేశాం. కొత్తపట్నం మండలంలో ఫిషింగ్‌ హార్బర్‌ కు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.90 కోట్లతో పోతురాజు కాల్వ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. రూ.200 కోట్లు రోడ్లు, డ్రెయిన్లకు ఖర్చు పెట్టాం. ఒంగోలులో 25 వేల పట్టాలిస్తామని చెప్పాం. కానీ టీడీపీ కోర్టులో కేసు వేయడంతో ఆగిపోయింది. ఈ నెలలో డబ్బులు పడతాయి. వచ్చే నెలలో పట్టాలు ఇస్తాం. పట్టాలు ఇవ్వకపోతే నేను ఒంగోలు నుంచి పోటీ చేయను” అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *