రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం బజారు సిమెంట్ రోడ్డును ఆయన బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యేను దుశ్శాలువాలు, పూలమాల లతో ఘనంగా సత్కరించారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లా డుతూ.. నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో పార్టీలు చూడకుండా నేరుగా లబ్ధి దారుల ఖాతాలకే సం క్షేమ పథకాల ఫలాలు అందజేసి అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చారని చెప్పారు. గత టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి పింఛన్లు దగ్గర నుంచి ఏ పథకం రావాలన్నా లంచాలు లేనిది పని కాలేదని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ నాయకులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి తాము చేసింది ఇదీ అని సగర్వంగా చెప్పుకుంటున్నారంటే అది సీఎం వైఎస్ జగన్మో హన్ రెడ్డి కృషి అని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 175 సీట్లకు 175 సీట్లు రావడం ఖాయమని ఎమ్మెల్యే మద్దిశెట్టి స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, మండల పార్టీ అధ్యక్షుడు వెన్న పూస వెంకటరెడ్డి( మహేష్), గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరె క్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీనాబాషా, ఎంపీపీ సుధాఅచ్చయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, వైఎ స్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, నగర పంచాయతీ కమిషనర్ మహేశ్వరరావు, కౌన్సిల ర్లు మేడం మోహన్ రెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ సర్పంచ్ వెన్నపూస శేషిరెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ సైదా, లక్ష్మణరావు పాల్గొన్నారు.


