కూకట్ పల్లి లో ఎక్కడి సమస్యలు అక్కడే…ఒక్క అవకాశం ఇవ్వండి.కూకట్ పల్లి రూపు రేఖలు మారుస్తా…. బిజే పి. జనసెన బల పర్చిన ఉమ్మడి అభ్యర్థి…. ముమ్మరెడ్డి ప్రేమ్ కుమార్.

కూకట్ పల్లి నియోజకవర్గం లో బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.ఎక్కడి సమస్యలు అక్కడే వున్నాయని బిజే పి బలపర్చిన జన సేన వుమ్మడి అభ్యర్థి ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ అన్నారు.బుధవారం మూసాపేట్ డివిజన్,మోతీ నగర్ హనుమాన్ మందిర్ నుండి ఆయన పాదయాత్రను ప్రారంభించారు ఈ సంధర్భంగా బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ ….. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తు పైన ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ,జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.డి.ఎస్.పి కాలనీ,పాండురంగరావు నగర్,కబీర్ నగర్,పప్పు గూడ,అవంతి నగర్,స్నేహపురి కాలనీ,రామారావు నగర్ వరకు పాదయాత్ర కొనసాగించారు. కూకట్పల్లి నియోజక వర్గం లో ఏ ప్రాంతాన్ని కి వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యే అవినీతి,భూకబ్జాల గురించి మాట్లాడుకుంటున్నారన్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,బిజెపి,జనసేనతో మార్పు తద్యమని తన వెంట పాదయాత్రలో పాల్గొన్న మీ అందరిని చూస్తే అర్థమవుతుందన్నారు.ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్,ఎర్రస్వామి,కిషోర్, సద్గుణ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు,డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు,మహిళా నాయకులు,నాగేంద్ర,సూర్య,జనసేన నాయకులు,వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *