మతసామరస్యానికి అభివృద్ధికి ప్రతీక అల్లాపూర్… ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

గురువారం ప్రజా ఆశీర్వాద ర్యాలీ సందర్భంగా అల్లాపూర్ డివిజన్లోని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సబియా గౌసిద్ధిన్ తో కలిసి ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు… అల్లాపూర్ డివిజన్లో ముస్లిం సోదరులు, హిందూ సోదరులు మతసామరస్యానికి ప్రతీకంగా నిలుస్తూ ఆదర్శంగా ఉన్నారని ఇందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలే కారణమని అన్నారు.. అందరం కలిసిమెలిసి నేడు తెలంగాణ రాష్ట్రంలో సుఖసంతోషాలతో జీవిస్తున్నామంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు.. కాంగ్రెస్ బిజెపి ఏనాడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోలేదని ..ఎప్పుడూ కుల, మత రాజకీయాలు తప్ప వారికి ప్రజల అభివృద్ధి, శాంతిభద్రతలు అవసరం లేదని అన్నారు.. అల్లాపూర్ డివిజన్లోని పదేళ్ల క్రితం వర్షం వస్తే రోడ్లు బురద మయంగా మారి ఎంతో అస్తవ్యస్తంగా ఉండేవని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఒక మురికిగుంటలా మారేదని అన్నారు… దానిని పూర్తిగా ప్రక్షాళన చేసి నేడు అద్దాలు లాంటి రోడ్లు వేసి భూగర్భ పైప్లైన్ తో సురక్షిత మంచినీరు అందించి నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో నేడు ఆదర్శ నియోజకవర్గంగా మారిందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్లనేనని అన్నారు.. అందుకని రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్నీ చేసుకుందామని తనను ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *