అంబేడ్కర్ కు నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించిన మమ్మా రెడ్డి- మార్పు కావాలంటే మమ్మా రెడ్డిని గెలిపించండి…..సినీ నటి.బీ జె పీ నాయకురాలు కవిత.

కూకట్పల్లి నియోజకవర్గంలో మార్పు కావాలంటే మమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ ను గెలిపించాలని సినీ నటి బీ జే పి నాయకురాలు కవిత ఓటర్లను కోరారు.గురువారం సాయంత్రం బీ జే పి – జనసేన బలపర్చిన ఉమ్మడి అభ్యర్థి మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి పాదయాత్రను ప్రారంభించారు. కూకట్పల్లి డివిజన్,దయాల్ గూడ లోఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రముఖ సినీ నటి,బిజెపి నాయకురాలు శ్రీమతి కవిత ప్రచార యాత్రలో పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఎలా అభివృద్ధి చెందిందో చూశాం,అలాగే రాష్ట్రం బాగుండాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి తీసుకురావాలని ఆమె కోరారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని పనిచేస్తున్నారనీ అన్నారు. నరేంద్ర మోడీ నీ పెద్దన్నలా భావించి ఆయన వెంట నడుస్తున్నారన్నారు.ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని. ముమ్మారెడ్డి రెడ్డి ప్రేమ కుమార్ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఆయన విద్య, వైద్య, ఉద్యోగ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారనీ ఆమె గుర్తు చేశారు.ముమ్మారెడ్డి నీ కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే,ప్రతి ఒక్కరు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను.కూకట్పల్లి డివిజన్లో మైత్రి నగర్,వడ్డేపల్లి ఎంక్లేవ్, ప్రశాంతినగర్,సాయిబాబా కాలనీ, వరకు పాదయాత్ర సాగింది.ఈ కార్యక్రమంలో ఎ.సూర్య రావు,వడ్డేపల్లి రాజేశ్వరరావు, పవన్ సాయి , నాగరాజు,శంకర్,ఈశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,డివిజన్ నాయకులు,మహిళా నాయకులు,జనసేన నాయకులు, వీరమహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *