అద్దంకి పోలీస్ స్టేషన్లో నమోదైన దళితుల భూ ఆక్రమణ కేసులో బాపట్ల ఎస్సీ ఎస్టీ డిఎస్పి ఏ వి రమణ గురువారం దళిత నాయకులు సమక్షంలో విచారణ జరిపారు. మొదట తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ఆబోతు.. విమలమ్మ కు చెందిన ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు అద్దంకి మండలం మోదేపల్లి సర్వేనెంబర్ 372/10 లో 19 సెంట్ల భూమిని 2017 వ లక్ష యాభై వేల రూపాయలకు ఆబోతు. విమలమ్మ కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. కానీ రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలంపై కన్నేసిన పక్క పొలానికి చెందిన ఆలోకం హరిబాబు మరియు చిన్నమ్మాయిలు దళితుల భూమిని ఆక్రమించుటకు కుట్ర చేశారు. ఈ భూమిలో పశువుల మేత పైరు దళితులు వేసుకోగా గత నెల రోజుల క్రితం దున్ని పంటను ధ్వంసం చేశారు. అప్పటినుండి తాళ్లూరు పోలీస్ స్టేషన్ కు మరియు అద్దంకి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసిన దళితులకు న్యాయం జరగలేదు. బాపట్ల కలెక్టర్కు కూడా తమకు న్యాయం కావాలని బాధితురాలు స్పందనలో ఫిర్యాదు చేశారు అద్దంకి ఎమ్మార్వో కి కలెక్టరేట్ వారు ఫిర్యాదును పంపి చేతులు దులుసుకున్నారు. యధావిధిగా అద్దంకి ఎమ్మార్వో కార్యాలయం దళిత బాధితురాలి భూమి ఆక్రమణ ఫిర్యాదు పై స్పందించలేదు. బాధితులు అద్దంకి వెళ్లిన ఎమ్మార్వో రిపోర్టు రావాలి ఇది సివిల్ మ్యాటర్ అంటూ రెండు వారాలు కాలయాపన చేశారు. తేరా ఈ విషయం దళిత నేత నీలం. నాగేంద్రం దృష్టికి రాగా వెంటనే చీరాల డిఎస్పి ప్రసాద్ రావు తో ఫోన్లో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పై పోలీసు అధికారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. తరువాత అద్దంకి సీఐ రమేష్ బాబు తో ఫోన్లో మాట్లాడి ఆబోతు. విమలమ్మ కు చెందిన భూమి ఆక్రమణ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారు. ఈనెల 19వ తేదీన ఎస్సీ ఎస్టీ కేసుగా నమోదైన ఈ కేసులో బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్ల ఎస్సీ ఎస్టీ డిఎస్పి ఏవి రమణను విచారణ అధికారిగా నియమించారు. విచారణ నిమిత్తం వచ్చిన బాపట్ల డిఎస్పి ఆక్రమణకు గురైన దళితుల భూమిని సందర్శించడమే కాకుండా నిందితులను కూడా పిలిపించి వారి స్టేట్మెంట్ తీసుకున్నారు. సాక్షులను కూడా అద్దంకి పోలీస్ స్టేషన్లో దళిత నాయకుల సమక్షంలో నీలం. నాగేంద్రం, దారా. అంజయ్య సమక్షంలో విచారించారు. ఈ కేసు విచారణలో బాపట్ల ఎస్సీ ఎస్టీ డిఎస్పి వెంట అద్దంకి రూరల్ ఎస్సై కే వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. దళితుల భూములు ఆక్రమిస్తే జైలుకు పంపిస్తామని బాపట్ల డిఎస్పి ఈ కేసులో నిందితులను హెచ్చరించారు.

