కాంగ్రెస్ గారడీలు నమ్మొద్దు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు కలిసి శుక్రవారం బాలాజీ నగర్ డివిజన్లోని ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా చేయలేని పనులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసి చూపించామని ఇప్పుడు ఏదో వచ్చి అది చేస్తాం, ఇది చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు ..కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో ఎక్కడైనా 2000 పింఛన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అలాగే 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారా అని సవాల్ విసిరారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారని అందుకు నిదర్శనమే ఇటీవల జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న పురస్కారాలు చూసి తెలుసుకోవాలని అన్నారు.. నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థితిలోకి చేరుకుందని ,ఒకప్పుడు బీడు భూములతో .. ఎండిన చెరువులతో వలస ప్రజలతో తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోయేదని ..నేడు పచ్చని పంట పొలాలతో నిండుకుండల్లా చెరువులతో కళకళలాడుతున్న తెలంగాణను చూస్తున్నామని అన్నారు .బాలాజీ నగర్ డివిజన్లోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఈ పదేళ్ల కాలంలో ముందుకు వెళ్ళామని ఇందుకు నిదర్శనమే చెరువులు సుందరీకరణలో భాగంగా రంగదామును చెరువు అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని ఇంకా త్వరలోనే మిగతా పనులు కూడా పూర్తి చేసి అన్ని చెరువులను సుందరీకరణ చేస్తామని.. మహిళలకు చిన్నారులకు ప్రత్యేకమైన పార్కులు గల్లీ గల్లీకి సిసి రోడ్లతో ఆదర్శ డివిజన్ గా మార్చబోతున్నామని అన్నారు. మళ్ళీ ఇదే అభివృద్ధి కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే ఉండాలని తనను కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ..ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *