సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్వర్గీయ జి.సాయన్న ఆశయ సాధన కోసం కూతురు లాస్య నందితకు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారని, లాస్య నందిత అత్యధిక ఓట్లతో విజయం ఖాయమని సీనియర్ బీఆర్ఎస్ నేత ముప్పిడి గోపాల్ జోష్యం చెప్పారు.
ఈ మేరకు ముప్పిడి గోపాల్ స్వయంగా మూడు వేలకు పైగా కరపత్రాలు, స్టిక్కర్స్ ఫ్రింట్ చేయించి కంటోన్మెంట్ పరిధిలో గల బాలంరాయి లో అభ్యర్థి లాస్య నందిత, కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారం కమిటీ ఇన్చార్జి, బేవరీస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ సమక్షంలో విడుదల చేశారు.
అలాగే తనదైనశైలిలో గోపాల్ తన అనుచర గణం నరేష్,వేణు,సాయి, హనుమంతు, సలీం,మగ్భుల్ తదితరులు బడీ మజీద్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్థు కరపత్రాలు పంపిణీ చేశారు.
మజీద్ లో ముస్లిం సోదరులు నమాజ్ చేసిన అనంతరం వారు మజీద్ నుంచి బైటికి వెళ్లిన అనంతరం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా గోపాల్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గా సాయన్న చేసిన సేవలు అమోఘమని ఆయన పై ఉన్న అభిమానం చేసిన సేవలు స్ఫూర్తిదాయకంతో, బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో అభ్యర్థి లాస్య నందిత భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ముప్పిడి గోపాల్ అన్నారు.
