బేగంపేట డివిజన్ లో బీజేపీ ప్రచారానికి జన నీరాజనాలు… మంగళహరతులతో మహిళలు స్వాగతం…. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: మర్రిశశిధర్ రెడ్డి

సనత్ నగర్ నియోజకవరంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రిశిధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సనత్ నగర్ నియోజకవరం బేగం పేట డివిజన్ లోని భరణికం ప్లెక్స్, సింధి కాలనీతోసాలు ప్రశాంత్ అపార్ట్మెంట్, గ్రీన్ గెట్ అపార్టమెంట్లలో మర్రి శశిధర్ రెడ్డి తన కార్యకర్తలతో కలసి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు మంగళ” వారతులు పలికారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ …గడిచిన తొమ్మదిన్నర సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలంతా పూర్తిగా విసుగుచెందన్నారు. నియోజకవర్గంలో ఏక్కడి సమస్యలు అక్క డే ఉన్నాయని. వాటిని పరిష్కారించాల్సిన మంత్రి తలసాని ఏ మాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేశరన్నారు. గత ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చిన తలసాని ఏ ఒక్కటి కూడ అమలు చేయలేకపోయారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలంతా ఒక్కసారి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. తాను చేపాడుతున్న పాదయాత్రలో ప్రజలు ఎంతో సంతోషంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు షేక్ గౌస్, నితిన్, సత్యలక్ష్మి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *