యూటీఎఫ్ కు బూచేపల్లి అండ -కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ

యూటీఎఫ్ అంటే బూచేపల్లి కుటుం బానికి ఎనలేని ప్రేమ ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. దర్శి టీచర్స్ కాలనీలో యూటీఎఫ్ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. యూటీఎఫ్ నాయకులు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దివంగత దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి యూటీఎఫ్ కార్యాలయానికి స్థలం ఇచ్చా రని, ఆస్థలంలో భవనం నిర్మించి దానిని తాను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయాలను తమ కుటుంబం కొనసాగిస్తుందని ఆమె నొక్కి వక్కాణించారు. ఉన్నతమైన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే మూలకార ణమన్నారు. క్రమశిక్షణ గల యువతను తయారు చేసి దేశానికి అందించాలని కోరారు. యూటీఎఫ్ కు ఏ అవసరమొచ్చినా మేమున్నామని మరువ వద్దన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె. శ్రీనివాస్, ఇతర నాయకులతో కలిసి ఉపాధ్యాయులను టార్గెట్ చేసి చిన్న తప్పులకు మెమోలు ఇస్తూ డీఈఓ వేధిస్తున్నారని, జిల్లాకు రెగ్యులర్ డీఈఓ లేరని ఈ సమస్యలపై ఇన్చార్జి డీఈఓ, ఆర్జేడీతో మాట్లాడి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అందుకు సాను కూలంగా స్పందించిన ఆమె రాబోవు జిల్లాపరిషత్ సమావేశంలో ఆర్జేడీతో మాట్లాడి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఏ ప్రభుత్వంలో అయినా సమస్యలు ఉండటం సహజమని దర్శి మాజీ శాసనసభ్యుడు నారపుశెట్టి పాపా రావు అన్నారు. ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బు లను సంక్షేమ పథకాలకు వినియోగించుకుంది. వాటిని తిరిగి సకాలంలో చెల్లించి ఉపాధ్యాయులకు సహకరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాదు మాట్లా డుతూ రాష్ట్రంలో ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవ స్థలో సంస్కరణల పేరిట అనూహ్యమైన మార్పులు తెచ్చి అందమైన మార్పులు తెచ్చారు, మధ్యాహ్న భోజనం మెరుగ్గా పెట్టడం ఆనందకరమైన విషయమ న్నారు. అలాగే రాష్ట్రమంతా ఒకే విద్యావిధానం అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం అంకితభావంతో ఉన్నట్లయితే ఉపా ధ్యాయులు ఇంకా మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, జిల్లా అధ్యక్షుడు వి. వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్. రవి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు పి.రమణారెడ్డి, జిల్లా సహ అధ్యక్షుడు ఉమా మహేశ్వరి, జిల్లా గౌరవాధ్యక్షులు కేశవరాజు, జిల్లా కార్యదర్శులు డి. వెంకటరెడ్డి, టి. రాజశేఖర్, మండల వైఎస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కౌన్సిలర్ ఆవుల జ్యోతి, ఎంపీడీఓ కుసుమకుమారి, ఎంఈఓ రఘురామయ్య, యూటీఎఫ్ మాజీ బాధ్యులు ఎస్వీ సుబ్బారెడ్డి, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శి మీనిగ శ్రీను, పి. కాశీం, ఐదు మండలాల అధ్యక్ష, కార్యద ర్శులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *