జగనన్న పాలనలో పేదలందరికి పట్టాభిషేకం జరిగిందని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. మల్కాపురం పంచాయితీ పరిధిలో మంగళవారం వై నీడ్స్ ఎపీ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచి షేక్ వలి అధ్యక్షతన సభను నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ పేదలకు మరలా మేలు జరగాలంటే సీఎంగా జగనన్న ఉండాల్సిన అవశ్యకతను వివరించారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా అందించిన సంక్షేమ పథకాలను గమనించి ప్రతి ఒక్కరూ సీఎం వైఎస్ జగనన్నకు మద్దతు తెలిపాలని కోరారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఎగువ వేసారు. సంక్షేమ పథకాల జాబితాను ఆవిష్కరించారు. ఈఓపీఆర్డీ కెజి ఎన్ రాజు, పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, కోఆప్షన్ మెంబెర్ కరిముల్లా, బి కే వి పాలెం సర్పంచ్ పిఎస్ శ్రీకాంత్ రెడ్డి , మన్నేపల్లి సొసైటీ చైర్మన్ కుమ్మిత జయరామి రెడ్డి, గ్రామకార్యదర్శి పవన్కుమార్లు పాల్గొన్నారు.


