తాళ్లూరు మండలంలో జగనన్న గృహాలు మంజూరైన లబ్ధి దారులందరూ గృహాలను నిర్మించుకునేందుకు ఎన్ఆర్ఆజీఎస్ పథకం ద్వా రా 90రోజుల పనిదినాలు కల్పించాలని ఎంపీడీవో కేవై యుగకీర్తి తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో పలు శాఖల అధికారులతో మంగళవారం సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కె.వై. కీర్తి మాట్లాడుతూ పలుగ్రామాల్లో జ గనన్న గృహాలుమంజూరయ్యాయన్నారు. లబ్ధిదారులకు ఉపాధి పథకం కిం ద నిధులు మంజూరు చేసేందుకు 90 రోజుల పనిదినాలు కచ్చితంగా కల్పిం చాలన్నారు. గృహాలు నిర్మించుకునే లబ్దిదారులకు పనిదినాలు కల్పించి బి ల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ ఈజీఎస్ ఏపీవో మురళి, హౌసింగ్ ఇన్చార్జి కె.కోటిరెడ్డి, ఇంజనీరింగ్ అసి స్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
90 రోజుల పనిదినాలు కల్పించాలి -ఎంపీడీవో యుగకీర్తి
29
Nov