యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావాలని.మాజీ మెట్రో పాలిటన్ మేజస్ట్రేట్ క్రిమినల్ కోర్టులు , హైదారాబాద్ జిల్లా, న్యాయ రత్న అవార్డు గ్రహీత అంతర్జాతీయ బార్ అసోసియేషన్ సభ్యులు బాద్ షా నవాజ్ ఖాన్ పిలుపు నిచ్చారు.గురువారం మలక్ పేట నియోజక వర్గం పరిధి లోని పోలింగ్ బూత్ 213 జీ హెచ్ ఎం సీ కమ్యూనిటీ హాలులో న్యాయ మూర్తి తన కుటుంబం తో ఓటు హక్కును విని యోగించు కున్నారు. ఈ సందర్భంగా గా న్యాయ మూర్తి బాద్ షా నవాజ్ ఖాన్ మాట్లాడుతూ… రాజ్యాధికారం లో బడుగు.బలహీన వర్గాలకు మరింత ప్రాధాన్యత పెరగాలి అని అన్నారు.అంబేడ్కర్ కలలు కన్న రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలన్నారు.యువత.మహిళలు రాజకీయంగా మరింత ఎదగాలని అన్నారు.పేద.వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సిన అవసరం వుందన్నారు.
