దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల వారికి రుణ సౌకర్యం కల్పించాలని మోప్మా ఎపీ డైరెక్టర్ విజయలక్ష్మి ఆదేశాలివ్వటంపై నవ్యాంద్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా హర్షం వ్యక్తం చేసారు. మెప్మా ఎపీ డైరెక్టర్ విజయలక్ష్మిని ముందుగానే కలిసి తాము దివ్యాంగుల దినోత్సవం నిర్వహణపై కూడ విన్నవించామని, దివ్యాంగులు ఆర్థికంగా ఎదిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా మోస్మా అధికారులకు సర్కులర్ జారీ చేయటంపై ఒక ప్రకటనలో సంఘ జిల్లా అధ్యక్షుడు భాను ప్రకాశ్, షేక్ నజీర్ భాషలు హర్షం వ్యక్తం చేసారు.

